ఇష్థ కామేశ్వరి దేవి శ్రీశైలం
శ్రీశైలము
ప్రసిద్ధ శైవ క్షేత్రము. శ్రీశైలము ఆంధ్రప్రదేశ్
రాష్ట్రమునందు కర్నూలు జిల్లాలో ఉంది. హరహర మహదేవ శంభో శంకరా అని భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంది
శ్రీశైల క్షేత్రము. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య
గల శ్రీ మల్లికార్జునుని పవిత్రమైన క్షేత్రము ఈ శ్రీశైల క్షేత్రము. దట్టమైన అరణ్యాల
మధ్య భక్తజనులను కాపాడేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి ఈ శ్రీశైల
క్షేత్రము. చాళుక్యులు, విస్ణుకుండినులు, పల్లవులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఇక్ష్వాకులు, శివాజీ లాంటి ఎందరో
సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ
పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పరమ పవిత్ర క్షేత్రం. శ్రీశైలం ద్వాదశ
జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.
శ్రీశైల క్షేత్ర
స్థల పురాణం : పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రపంచాన్ని
పరిపాలించేవాడు. అతను చాలా కాలం
పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరాన్ని
పొందగలిగాడు. ఈ వర ప్రభావానికి భయపడిన దేవతలు ఆదిశక్తి అమ్మవారిని ప్రార్థించారు.
అమ్మవారు ప్రత్యక్షం అయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు
అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత దేవతలు అందరు
కలిసి దేవతల గురువైనా బృహస్పతి దగ్గరికి వెళ్లి జరిగిన దానిని వివరిస్తారు. బృహస్పతిని రాక్షసుడైన అరుణాసురని దగ్గరికి పంపుతారు.
అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం పోయి అతన్ని ప్రశ్నిస్తాడు, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని
పూజిస్తాము, గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈ రకంలో
వింత ఏమి లేదని చెప్తాడు. అందుకు అరుణాసురుడు దేవతలు కూడా పూజ చేస్తున్న
అమ్మవారిని నేను ఎందుకు పూజించాలని అహంకరించి గాయత్రి మంత్ర జపాన్ని అపివేస్తాడు. అలా
చేసినందుకు అమ్మవారికికోపం వచ్చి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని
సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడి యొక్క సైన్యాన్ని సంహరిస్తాయి.
ఇష్థ
కామేశ్వరి దేవి :
ఇక్కడి
పర్వతాలపై కొలువుధీరిన మల్లన్న స్వామిని ఒకప్పుడు ఇక్కడి చుట్టుపక్కల గూడెం ప్రజలు
దర్శించుకునే వారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల నుండి దేశాల నుండి భక్తులు వచ్చి
స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడి నల్లమల అడవిలో అనేక రకాలైన ఆరోగ్య
పరమైన మూలికలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు అడవిలో ఉంటాయి.
ప్రాచీనకాలం
నాటి ఆలయాలు కూడా ఇక్కడ ఇంకా పూజలు అందుకుంటు ఉంటాయి. అలాంటి వాటిలో అత్యంత
విశిష్టమైనదిగా ‘ఇష్టకామేశ్వరీ ఆలయం’ దర్శనం ఇస్తుంది. పూర్వం ఈ ఇష్టకామేశ్వరీ దేవి అమ్మవారికి
సిద్ధులు పూజలు చేసేవారు. ఈ అమ్మవారిని శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గ సమీపం
ద్వారా చేరుకోవచ్చు. దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేస్తే
తప్ప ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడి ఆలయంలో ఉన్న అమ్మవారు
నాలుగు భుజాలను కలిగి ఉండి, రెండు చేతులలో తామర పుష్పాలను, మిగతా రెండు చేతులలో
జపమాల, శివలింగం దర్శనం ఇస్తాయి. ఈ అమ్మవారి నుదురు మెత్తగా ఉంటుంది అని అభిషేకాలు
నిర్వహించే పూజారులు వివరించారు. అమ్మవారిని దర్శనం చేసుకొని తమ
కోరికలు విన్నవించుకుంటే, తప్పకుండా తమ కోరికలు తీరుస్తుందని
ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విషయం గురుంచి “ఇష్ట
కామేశ్వరీ వ్రతం లో” ఉంటుంది.
No comments:
Post a Comment